calender_icon.png 8 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ దూకుడు.. సీఎం తమ్ముడికి నోటీసులు

07-01-2026 03:17:26 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోదరుడు కొండల్ రెడ్డికి(Kondal Reddy) సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని కొండల్ రెడ్డి రెడ్డికి నోటీసుల్లో పేర్కొన్నారు. విపక్షనేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, చిరుముర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలి నోటీసుల్లో ఆదేశించారు.

ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ ఇప్పటికే నోటీసులిచ్చింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. కొండలరావు, సందీప్ రావులు ఇవాళ సిట్ విచారణకు హాజరుకాలేదు. అనారోగ్యం వల్ల సిట్ కార్యాలయానికి రాలేకపోతున్నామని కొండల్ రావు తెలిపారు. తన నివాసంలోనే విచారణకు సిద్ధమని సిట్ కు తెలిపారు. కొండలరావు, సందీప్ రావు ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది.