07-01-2026 03:19:50 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు నడపడానికి ఇవ్వొద్దని కొమురవెల్లి ఎస్ఐ మహేష్ అన్నారు. మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వాహనాన్ని నడిపేటప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.
పిల్లలు వాహనాలు నడిపితే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.రమేష్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.