28 March, 2026 | 2:34 AM

వైభవంగా సీతారాముల కల్యాణం

28-03-2026 12:19 AM

అడ్డాకుల, మార్చి 27 : మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ శిరిడి సాయి దేవాలయంలో నిర్వహించినసీతారాముల కళ్యాణం మహోత్సవంలో సర్పంచ్ దశరథరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. అత్యంత వైభవోపేతంగా, కన్నుల పండువగా జరుగుతుంది. వందలాదిమంది భక్తుల సాక్షిగా, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో ఈ లోకోత్తర వివాహ వేడుకను జరిపిస్తారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దశరథ రెడ్డి మాట్లాడుతూ అడ్డాకుల గ్రామ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి పండుగ హిందువులు అత్యoత వైభవముగా జరుపుకునే పండుగను అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు