calender_icon.png 28 July, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 611 దరఖాస్తులు

04-09-2024 01:22:27 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 611 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి 149, బీసీ సంక్షేమం 123, మైనార్టీ శాఖ 94, విద్యుత్ శాఖకు 57, రెవెన్యూ శాఖ 54, ఇతర శాఖలకు 134 దరఖాస్తులు అందినట్లు వెల్లడిం చారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి, ప్రజాపాలన అధికారి దివ్య దేవరాజన్  కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.