24-12-2025 07:36:18 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. పట్టణంలోని క్రైస్తవ మందిరాలు ముస్తాబయ్యాయి. శుక్రవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా క్రైస్తవ సోదరులు జరుపుకానున్నారు. క్రైస్తవల ఆరోగ్య దైవం ఏసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్ వేడుకలుగా జరుపుకుంటారు. పట్టణంలోని సీఎస్ఐ, పెంతకొస్తూ, జేసుతీరు హృదయం తదితర ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించారు. విద్యుత్ దీపాలతో ఆలయాలు ఆకట్టుకుంటున్నాయి.
క్రిస్మస్ ముందస్తు వేడుకలు గత పక్షం రోజులుగా బెల్లంపల్లిలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు బుధవారం రాత్రి నుంచే ఆలయాల్లో ప్రార్థనలతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆయా ప్రార్థనా మందిరాలకు క్రైస్తవులు కుటుంబ సమేతంగా చేరుకుంటారు. భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. క్రైస్తవ దేవాలయాల వద్ద వేడుకల సందడి నెలకొన్నది. వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సామూహిక ప్రార్ధనలకు దేవాలయాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఎప్పుడెప్పుడాని క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పర్వదినం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఏసుక్రీస్తు పుట్టిన పాకఏర్పాటు
క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బెల్లంపల్లిలోని ఆయా దేవాలయాల్లో క్రీస్తు పుట్టిన పాకను ఏర్పాటు చేశారు. క్రీస్తు పుట్టిన పాక వద్ద క్రైస్తవ భక్తులు ముందుగా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. అటు తర్వాత ఆలయాల్లోకి వెళ్ళి సామూహిక ప్రార్ధనలు జరుపుతారు. ఈ వేడుకల సందర్భంగా క్రీస్తు జననం జరిగిన పాకను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య ఘట్టం. కాగా ఈ సన్నివేశాన్ని క్రైస్తవ సోదరులు ఎంతో ఆసక్తితో తిలకిస్తారు.