calender_icon.png 13 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పాట్లు

13-08-2025 12:50:00 AM

  1. విక్రయ కేంద్రాల వద్ద రైతుల బారులు 
  2. టోకెన్ల కోసం పడిగాపులు
  3. గంటల తరబడి నిలబడితే రెండే బ్యాగులు పంపిణీ

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, ఆగస్టు 12: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక పాట్లు పడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలతో పాటు ఫర్టి లైజర్ షాపుల వద్ద నిత్యం బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటలకే విక్రయ కేం ద్రాలు, ఎరువుల దుకాణాల వద్దకు రైతులు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా మహిళా రైతులు గొడుగులతో క్యూలో నిలుచుంటున్నారు. మంగళవారం కూడా రాష్ట్రం లోని పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం విక్రయ కేంద్రాలకు తరలివచ్చారు.  

టోకెన్ల కోసం ఇబ్బందులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మంగళవారం 25 టన్నుల (500ల బస్తాల) యూరియా ను వ్యవసాయ అధికారులు రైతులకు పంపి ణీ చేశారు. బుధవారం వచ్చే యూరియా కోసం కూడా మంగళవారం టోకెన్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ పిఎసిఎస్ కా ర్యాలయం వద్ద యూరియా టోకెన్లను పంపిణీ చేయగా రైతులు ఒకేసారి గుమికూడారు. దీంతో ఇబ్బంది వాతావారణం నెల కొంది. పోలీసుల సహకారంతో రైతులను అదుపు చేసి టోకెన్లు పంపిణీ చేశారు.

టోకె న్లు రాని రైతులు  పీఏసీఎస్ వద్ద చాలాసేపు వేచి ఉన్నారు. వర్షాలు కురుస్తుండడంతో వరి మొక్కజొన్న పంటలకు యూరియా కో సం ఉదయం నుండి దుకాణాల క్యూ కడుతున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలే ఇవ్వ గా, అవసరం ఉన్నంత స్థాయిలో రైతులకు యూరియా ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలే యూరియా ఇవ్వడం తో  ఎక్కువ భూమిలో వ్యవసాయం చేసే రై తులు రోజుల తరబడి యూరియా కోసం లై న్లో కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన 

సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం నంగనూరులో నిరసన చేపట్టారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నా యకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేయాలని ధర్నాలో భాగంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం రైతులకు యూరియాను సరఫరా చేయడంలో విఫలమైందని, దీనివల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. యూరియా సరఫరాపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తక్షణమే తొలగించాలని, రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందించాలని డి మాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో సరితకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య పి ఏసిఎస్ చైర్మన్ కోల రమేష్‌గౌడ్, నాయకులు కృష్ణారెడ్డి, ఉల్లి చిన్న మల్లయ్య, బెదురు తిరుపతి, వేణు చారి, రంగు రాజు, అజిత్, పరుశురాములు, మాధవరెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వం విఫలమే: బీఆర్‌ఎస్

సాగుకు అవసరమైన యూరియాను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు రైతులతో కలిసి సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద ధర్నా చేశారు. అంతకుముందు సొసైటీ వద్ద వందల మంది రైతులు యూరియా కోసం నిరీక్షించారు.

ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి ఎన్ సురేందర్, చీదురు వెంకన్న, కటార్‌సింగ్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి అవసరమైన యూరియాను ఇవ్వకపోవడం వల్ల, రైతులు ప్రతిరోజు యూరియా కోసం సొసైటీ వద్దకు వచ్చి వెళ్లాల్సి వస్తుందన్నారు.

పంటకు అవసరమైన యూరియాను ఒకేసారి తీసుకెళ్లడానికి వస్తే, ఒకటి రెండు బస్తా లు ఇస్తున్నారని, దీనితో రవాణా చార్జీలు భారంగా మారాయని, అటు వ్యవసాయ పనులను వదులుకొని ఇటు యూరియా కోసం తిరగాల్సి వస్తుందని ఆరోపించారు. రైతులకు 846 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు సరఫరా చేశామని, అవసరమైన మేరకు యూరియా తెప్పించి ఇస్తునా ్నమని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. అవసరమైనంత యూరి యా అందజేస్తామని, ఎవరు కూడా అపో హ పడవద్దని సూచించారు. 

ప్రైవేట్‌లో బస్తా బస్తాకు లింకులు

మంచిర్యాల జిల్లాలో సొసైటీలకు ఎరువులు తక్కువ పంపిస్తుండటంతో అవి ఎటు సరిపోక ప్రైవేట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్‌లో ఒక యూరియా బస్తాకు ఒక గంట ముందు అంటే రూ.267 బస్తాకు అదనంగా మరో రూ.350 చెల్లించి కొంటున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా నియంత్రించడం లేదు. 

ఉదయం 7 గంటలకే బారులు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా కొరత వేధిస్తున్నది. చిగు రుమామిడి, ఇందుర్తి వ్యవసాయ పరపతి సహకార కేంద్రాల వద్ద రైతులు నిత్యం ఉద యం 7 గంటలకే చేరుకుని పడిగాపులు కా స్తున్నారు. మంగళవారం వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా మహిళా రైతులు గొడుగులతో క్యూలో నిలుచున్నారు. యూ రియా కావలసినంతగా రాకపోవడంతో వచ్చిన యూరియాను తీసుకెళ్లేందుకు ఇం దుర్తిలో వర్షానికి తట్టుకోలేక క్యూ లైన్లో నిల్చోలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టి నిరీక్షించారు.

పంటలకు సరిపడా యూరి యా తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.  సింగిల్ విండో కార్యాలయ సీఈవో నర్సయ్య మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని, మంగళవారం ఇందుర్తికి 680, చిగురుమామిడికి 444, రేకొండకు 230 బస్తాలు వచ్చినట్టు తెలిపారు. కొందరు రైతులు యూరియా దొరకదని అవసరానికి మించి రైతులు తీసుకెళ్లడంతో కేంద్రాల్లో యూరియా దొరకడం లేదన్నారు. 

గంటల తరబడి నిలబడితే రెండే సంచులు

మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 10 టన్నుల యూరియా రాగా రైతులకు అవసరమైన బస్తాలు ఇవ్వడంలో సొసైటీ సీఈవో ఇబ్బంది పడాల్సి వచ్చింది. మంగళవారం ఈ సొసైటీకి దాదాపు 260 బస్తాల వరకు రాగా రైతులు ఉదయం నుంచి క్యూ కట్టారు. తక్కువ బస్తాలు రావడం, క్యూలో పెద్ద మొత్తంలో రైతుల ఉండటంతో చివరివరకు తమకు రావని రైతులు ఆందోళనకు దిగారు.

వర్షాలు పడుతున్న సమయంలో ఎరువులు తీసుకురాకుంటే మేము ఎట్లా సాగు చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటలపాటు కార్యాలయం, ఆవరణలో రైతులు నిరసన ప్రదర్శించారు. సొసైటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో రైతులను వరుస క్రమంలో నిలబెట్టి ఎరువులను విక్రయించారు. రైతులకు ఎంత భూమి ఉన్న రెండు బస్తాల యూరియా మాత్రమే ఇచ్చి పంపించారు.

నానో యూరియా పనిచేస్తలేదు 

మొక్కజొన్న పొలంలో నేను నా నో యూరియా చ ల్లిన. కానీ అది పనిచేస్తలేదు. మొక్కలు అనుకున్నం త ఎదుగుతలేవు. అందుకే యూ రియా కోసం మూడుసార్లు గజ్వేల్‌కి వచ్చి న. ఒక్కసారి కూడా దొరకలేదు. అం కిరెడ్డిపల్లి వద్ద రెండు బ్యాగులు మా త్రం దొరికినాయి. రెండు ఎకరాలు మొక్కజొన్న, రెండు ఎకరాలు వరి పండిస్తున్న. యూరియా కోసం రో జు తిరగాల్సి వస్తుంది. మస్తు ఇబ్బం ది అయితుంది.

 పిట్ల ఎల్లయ్య, రైతు, గిరిపల్లి