హైదరాబాద్: ప్రస్తుత కాలానికి తగినట్లు యువతలో నైపుణ్యాలు పెరగాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాతం అభివృద్ది కోసం విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చారని, రైతుల త్యాగానికి ఫలితం ఉండాలంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని, స్కిల్ యూనివర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం అని, ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు అందుకుంటున్నారు.
ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నారు కానీ.. సరైన నైపుణ్యాలు ఉండటం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుత కాలానికి తగినట్లు యువతలో నైపుణ్యాలు పెంచడం కోసం రూ.150 కోట్ల వ్యయంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక స్కిల్ యూనివర్సిటీయ్యే కాకుండా మరో 4 ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయని, గత పాలకులు 3 నగరాలు నిర్మించారని, ప్రజాప్రభుత్వం నాలుగో సిటీని నిర్మించనుందన్నారు.
ఈ ప్రాంతంలో హెల్త, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్ గా మారుస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. ఉద్యోగం కల్పించే బాధ్యతను తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందని, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి, ఓఆర్ఆర్, విమానాశ్రయంతో రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగాయి, ముఖ్యమంత్రి వెల్లడించారు.