2 July, 2026 | 3:20 PM

Breaking News

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •  

ఎస్‌ఎల్‌బీసీకి సైన్యం సాయం కావాలి

12-06-2025 01:02 AM
  1. రెస్క్యూ పనులు వేగవంతం చేయడానికి సహకారమివ్వండి
  2. టన్నెల్ పురోగతి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
  3. ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ భేటీ

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్‌లో ఉన్న టన్నెల్ పనులను పూర్తి చేసేందుకు సైన్యం సాయం సాయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి బుధవారం రక్షణశాఖ అధికారులతో భేటీ అయ్యారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం లో ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌కు సహకారం అందించాలని కోరారు. నాగర్‌కర్నూ ల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఈ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) పనులు కొనసాగుతున్న సమయం లో ఆకస్మిక వరద, మట్టి, బురద కారణంగా టన్నెల్‌లో కొంత భాగం కూలిపోవడంతో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు.

ఇందు లో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నా.. ఈ ఆపరేషన్ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ పనులను వేగవంతం చేయడం కోసం రక్షణశాఖ సాయం కోరారు. అలాగే టన్నెల్ పురోగతి కోసం చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. నల్లమల రక్షిత అటవీ ప్రాంతం కావడంతో హెలిక్యాప్టర్ ద్వారా లైడర్ సర్వే చేసేందుకు సహకరించాలని కూడా రక్షణ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయారు.