calender_icon.png 19 November, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూమపానానికి దూరంగా ఉండాలి

19-11-2025 12:00:00 AM

  1. రాచకొండ సీపీ సుధీర్‌బాబు  
  2. కామినేని ఆస్పత్రిలో రోగ నిర్ధారణకు ప్రత్యేక ప్యాకేజి   

ఎల్బీనగర్, నవంబర్ 18(విజయక్రాం తి): ‘క్రానిక్ అబ్స్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అనేది ఎక్కువకాలం పాటు పొగ తాగడం, లేదా పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే తీవ్ర సమస్య అని, కావున తమ ఊపిరితిత్తుల ను కాపాడుకోవాలంటే ధూమపానం మానేయాలని రాచకొండ సీపీ జి. సుధీర్‌బాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ సీఓపీడీడే సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మధుమేహం, రక్తపోటు లాంటివి మన చేతు ల్లో లేని, మనం నియంత్రించలేని వ్యాధులు.. అదే సీఓపీడీ అయితే మనం సిగరెట్లు కాల్చకుండా ఉంటే చాలు.. అది మన దరి చేరదు అని అన్నారు. కాగా ‘సీఓపీడీని వీలైనంత ముందుగా గుర్తిస్తే అప్పటివరకు ఊపిరితిత్తులకు అయిన నష్టాన్ని కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించడానికి ఉన్న ఏకైక పరీక్ష.. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్టీ). సాధారణంగా దీనికి రూ.3వేల వరకు ఖర్చవుతుంది.

అయితే సీఓపీడీ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ వారు ఈ నెల 22వ తేదీ వరకు రూ.400కే ఈ పరీక్షను, పల్మనాలజిస్టు కన్సల్టెన్సీని అందిస్తున్నట్టు సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్ బాబు పడ్గుల్, ప్రిన్సిపాల్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ అంజయ్య కనుసోలి, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ కంది, డాక్టర్ రవీంద్రనాథ్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ డీఎస్ సౌజన్య, డాక్టర్ భరత్ జానపాటి తదితరులు మాట్లాడారు.