ఇంతింతై.. మైనపు బొమ్ము!
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్ ఐకానిక్ మ్యూజియంలో క్వీన్ ఎలిజబెత్ 11 తర్వాత మైనపు విగ్రహంగా కొలువుదీరిన ఏకైక సెలబ్రిటీగా రామ్‌చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ మ్యూజియాన్ని సందర్శించే తన అభిమానులకు రామ్‌చరణ్ ఇక మైనపు బొమ్మ రూపంలో అలరించనున్నారు.
ఇటీవల జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రామ్‌చరణ్ తన కుటుంబం, సన్నిహితులతో హాజరయ్యారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటించాల్సి వచ్చిందని ఆయన టీమ్ పేర్కొంది.
ఈ విగ్రహాన్ని మే 19 వరకు లండన్‌లో చూడవచ్చు. తర్వాత ప్రదర్శన కోసం మేడమ్ టుసాడ్స్ సింగపూర్‌కు తరలిస్తారు. మెగాస్టార్ వారసుడిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ తనదైన ప్రతిభతో ఇంతింతై ఎదగడమే కాకుండా ఇప్పుడు మైనపు బొమ్మగానూ చరిత్రపుటల్లో నిలవడం తెలుగు చిత్రసీమకు గర్వకారణం.






