calender_icon.png 28 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజాభివృద్ధి ప్రతి పౌరుని బాధ్యత

28-07-2025 01:34:26 AM

  1. రాజ్యాంగంలోని విధులు, బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను అనుభవించలేరు

‘హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాలయ్’ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): సమాజాన్ని అభివృద్ధి చేయడం సమాజంలోని ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అందులో భాగంగా వివిధ వర్గాల సంఘాలు, స్వచ్ఛంధ సేవా సంస్థలు ఎవరి శక్తి మేరకు వారు సేవా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు.

హర్యా ణా నాగరిక్ సంఘ్  (హెచ్‌ఎన్‌ఎస్ ) వారి సభ్యులతో పాటు పేదలకు కనీస చార్జీలతో వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్ సిక్ విలే జ్ లో హర్యాణా నాగరిక్ సంఘ్ (హెచ్‌ఎన్ ఎస్) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్’ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాలయ్ చైర్మన్ అంజనీకుమార్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, హెచ్‌ఎన్‌ఎస్ అధ్యక్షులు పదమ్ జైన్, సలహాదారులు రామ్ గోయల్, హెచ్.ఎన్. ఎస్ చికిత్సాలయ్ అధ్యక్షులు  పురుషోత్తం అగర్వాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సభ్యురాలు బి. నర్మద మల్లిఖార్జున్ తదితరులు  ప్రసంగించారు.

అనంతరం సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తూ సమా జం లేకుండా మనుషుల మనుగడ అసాధ్యమని, సమాజం శక్తివంతంగా ఉంటేనే ప్రజలు శక్తివంతంగా ఉంటారన్నారు. దేశ ప్రగతికి వైద్య సేవలు పునాది లాంటివని, కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధాలు లేకుండా వైద్య సేవలు ప్రజలందరికీ అందాలన్నారు. సమాజంలో అత్యవసరమైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వ యం త్రాంగంతో పాటు హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాలయ్ లాంటి స్వచ్ఛంధ సేవా సంస్థలు భాగ స్వామ్యం కావడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాలయ్ చైర్మన్ అంజనీకుమార్ అగర్వాల్, హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాలయ్ అధ్యక్షులు పురుషోత్తం అగర్వాల్,   హెచ్‌ఎన్‌ఎస్ చికిత్సాల య్ ప్రధాన కార్యదర్శి దీపక్ బింజ్రాజ్,  ఉపాధ్యక్షులు సుశీల్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి సందీప్ మిట్టల్, కోశాధికారి నారాయణ్ చౌదరి,  హర్యాణా సేవా సంఘం అధ్యక్షులు రాజేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందజేసిన దాతలు, ట్రస్టీలను గవర్నర్ ఘనంగా సత్కరించారు.