calender_icon.png 28 July, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించండి

28-07-2025 01:35:46 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో వివిధ కాలేజీ కోర్సులలో చదువుతున్న దాదాపు14 లక్షల మంది కాలేజీ విద్యార్ధులకు సంబంధించిన పెండిం గ్లో ఉన్న 6 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేబ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో వంద బీసీ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేసి బీసీ గురుకుల పాఠశాలల్లో 20 శాతం సీట్లను పెంచాలన్నారు. ఆదివారం బీసీ విద్యార్ధి సంఘం, నిరుద్యోగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన ఇందిరాపార్కు వద్ద బీసీ హాస్టల్ విద్యార్థులతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎంతో ముఖ్యమైన స్కాలర్షిప్, పీజు బకాయిల స్కీమ్ను ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నీరుగారుస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో పెండింగ్లో ఉన్న ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడం బాధకరమన్నారు.

ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు కోసం ప్రతియేటా నాలుగు శాఖల ద్వారా రాష్ట్ర బడ్జెట్లో 5 వేల కోట్ల నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ల్యాప్స్ చేశారని ఆయన మండిపడ్డా రు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న విధులు ఏమౌతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఉన్న విద్యకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెంది న వ్యవసాయ కూలీల పిల్లలు మెడిసిన్, ఇంజనీరింగ్ పీజీ, డీగ్రీ వంటి ఉన్నత చదువులు చదువులాపుతున్నారని దీంతో సమా జంలో గుణాత్మకమైన మార్పు ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇలాంటి మార్పును ఆహ్వానించల్సిందిపోయి అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఒకవైపు బీసీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ మరో వైపు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మభ్యపెడుతూ బీసీలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోది రాందేవ్, నాయకులు అనంతయ్య, రాజేందర్, శివ అనురాద గౌడ్, ఆశిష్ గౌడ్ తదితరులతో పాటు విద్యార్ధులు పాల్గొన్నారు.