07-09-2025 01:24:59 AM
-ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ముఖ్యం
-ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి ): ప్రతిఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయమందిస్తేనే సమాజం పురోగమిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజ కవర్గం బాచుపల్లిలో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025 ఇంటరాక్ట్ విత్ స్టూ డెంట్స్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాకు అను గుణంగా ప్రజల అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. ఈ తరుణంలో సమాజహితం కోసం కేవలం ప్రభుత్వాలే కృషి చేస్తే సరిపోదన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యంగా కామ రాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నా రు.
అన్నదానంతో పాటు విద్యాదానం చాలా ముఖ్యమని, విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే సాధనమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్ర మే కాదని, ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సేవే అని తెలిపారు. ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవని.. మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆద ర్శంగా నిలుస్తాయని వివరించారు.
గొప్ప విజయాలు అంత సులభంగా రావని, ఓపిక, పట్టుదల, నిరంతర కృషి అవసరమని తెలిపారు. ఎ న్ని అడ్డంకులొచ్చినా లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకుసాగితే తప్పనిసరిగా విజయం వరిస్తుందని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్, మ ల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.