07-09-2025 01:25:21 AM
ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముంది.
సోమవారం భద్రా ద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో, మంగళవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, ములుగు జిల్లాల్లో, బుధవారం ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామా రెడ్డి, కొమ్రంభీం, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలో గురువారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఈమేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.