28-06-2025 11:31:04 PM
చిలుకూరు: చిలుకూరు మండలంలోని ఆచార్యగూడెం గ్రామానికి చెందిన మొలుగూరి నాగరాజు ఆలోచన ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకుగాను అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు సామాజిక సేవ విభాగంలో ఇటీవల కాలంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై సురభి రాంబాబు గౌడ్, నాగరాజుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా డ్రగ్స్, గంజాయి, మద్యంకు దూరంగా ఉండేలాగా యువత చైతన్యవంతమయ్యే కార్యక్రమాలను ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని అందుకు మాసహాకారం కూడా ఉంటుందన్నారు.