26 March, 2026 | 3:40 AM

అటవీశాఖ ఆధ్వర్యంలో సోలార్ దీపాలు ఏర్పాటు

26-03-2026 01:09 AM

బెజ్జూర్, మార్చి ౨౫ (విజయక్రాంతి): మారుమూల గ్రామాల అభివృద్ధిపై అటవీ శాఖ కృషి చేస్తుందని, ఈ మేరకు బెజ్జూర్ మండలం లోని ఇందర్గాం, రేచిని, గబ్బాయి, తలాయి గ్రామాల్లో సోలార్ దీపాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు.

అటవీశాఖ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో సోలార్ దీపాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కృష్ణపల్లి సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సెక్షన్ అధికారి సఫియా బేగం, బీట్ అధికారులు స్రవంతి, వెంకటేశం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.