యువతకు చేయూత...! రేపే చివరి తేది
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ పై టూ వెల్లర్స్, ఆటోలు
మెదక్ జిల్లాకు 190 యూనిట్లు...రూ.4.40 కోట్లు మంజూరు
వ్యవసాయానికి సోలార్ పంపు కంట్రోల్ యూనిట్లు
మెదక్, మార్చి 22(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షె డ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధికల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద ఈ స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. బ్యాంకు లింకేజీతో రవాణా, వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందే వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
స్విగ్గీ, జోమాటో తదితర సంస్థల్లో పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న గిగ్ వ ర్కర్లకు ఈసారి ప్రాధాన్యమిస్తోంది. వీరికి రాయితీపై టూ వీలర్లను, రవాణా కోసం ఉపయోగించే త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చాలని నిర్ణయించింది. వ్యవ సాయం ద్వారా ఉపాధి కల్పించుకునే వారికి సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తారు.
రేపటి వరకే దరఖాస్తుల స్వీకరణ..
వివిధ యూనిట్ల కోసం ఆసక్తి ఉన్న యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 17న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా 24వ తేదీ వరకు వాటిని స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారికి ఆధారు కార్డ్, రేషన్ కార్డ్, కుల, ఆదాయ ధృవపత్రాలు అవసర ముం టుంది. ఎలక్ట్రానిక్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకునేవారు శాశ్వత డ్రైవింగ్ లైసె న్సు కలిగి ఉండాలి.
సోలార్ పంపు కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసుకునేవారికి రెండు ఎకరాల భూమి కలిగి ఉండి పట్టాదారు పుస్త కం ఉండాలి. ఆ వ్యవసాయ క్షేత్రంలో బోర్వె ల్ ఉన్నట్లు, నీటి లభ్యత ఉన్నట్లు గ్రామ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవలసి ఉంటుంది. దివ్యాంగులైతే సదరం స ర్టిఫికెట్ జతపరచాలి. పాస్పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. గడిచిన ఐదే ళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందినవారు ప్రస్తుతం ఆర్థిక సహాయం పొం దడానికి అనర్హులు. జిల్లాలో అర్హులైన నిరుద్యోగ ఎస్సీ యువతీ యువకులు గడు వులోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలి.
జిల్లాలో యూనిట్లు ఇలా..
మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం 190 ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇందులో 119 టూ వీలర్ ఈవీ వాహనాలు కాగా, వాహనం విలువ లక్ష రూపాయలు కాగా 90 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 10 శాతం డబ్బు లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. 59 ఎలక్ట్రిక్ ఆటో ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఒక్కో వాహ నం విలువ మూడు లక్షలు కాగా, 70శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 30 శాతం లబ్దిదారుడు చెల్లించాలి. 12 సోలార్ యూనివర్శల్ పంపు కంట్రోల్ యూనిట్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్ విలువ మూడు లక్షల నుంచి ఏడు లక్షలు ఉంటుంది. యూ నిట్ విలువను బట్టి 5 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగతా సొమ్ము లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది.
ఈ నెల 24 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశమున్నట్లు ఎస్సీ కార్పొరే షన్ అధికారులు తెలిపారు. వ్యవసాయేతర పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 2025 జూలై 1 నాటికి 21-50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ ఆధారిత యూనిట్లకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షిక ఆదాయం 1.5 లక్షలు, గ్రామీణేతర ప్రాంతాల్లో రెండు లక్షలకు మించి ఆదాయం ఉండరాదు. బ్యాంకు కాన్సెంట్ తప్పనిసరి ఉండాలి. ఒక రేషన్కార్డుపై ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి..
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయితీ వాహనాలు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత గల యువకులు, రైతులు ఈ నెల 24 లోగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. మెదక్ జిల్లాకు 190 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు (ఈవి)119, మూడు చక్రాలు(ఈవీ) 59, వ్యవసాయ పరికరాలు 12 ఉన్నాయి.
విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి




