23 March, 2026 | 1:50 AM

ఇప్పపువ్వుతో సహజసిద్ద తినుబండారాలు

23-03-2026 12:16 AM
  1. సేంద్రియ ఆర్గానిక్ ద్వారా తయారీ

భద్రగిరి మార్ట్లో ప్రారంభం

గిరిజన మహిళలకు గిరిజన రైతులకు చేకూర్పు

చర్లకు ప్రత్యేక బృందాన్ని పంపిన ఐటీడీఏ పీవో బి రాహుల్

వివరాలు వెల్లడించిన ఐటీడీఏ పీవో బి రాహుల్

చర్ల మార్చి 22 (విజయ క్రాంతి): శనివారం నాడు చర్ల మండలంలోని సున్నం గుంపు గ్రామములో శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లియాబిలిటీ గ్రూప్ మహిళలు నాణ్యమైన, మన్నికంగా ఉండేలా మరియు సుచి శుభ్రత పాటించి తయారు చేస్తున్నా ఇప్పపువ్వు లడ్డూలు, బర్ఫీ, చాక్లెట్లు, కరక్కాయ పౌడర్, నల్లేరు పచ్చళ్ళు కారంపొడి పాకెట్లు ఇతర గృహ అవసరాలకు అవసరం పడే ఆహార పదార్థాలను తయారు చేసిన విధానాన్ని ముఖ్యంగా వారు సేకరించి శుద్ధి చేసి అన్ని రకాల ఆరోగ్యాన్ని పోషకాలు ఇచ్చే ఇప్పపువ్వు, బెల్లం, యాలకులు, బాదం పప్పు,

జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, నెయ్యి, కిస్మిస్, పుచ్చ గింజలు నూరి అన్ని సమపాళ్లల్లో కలిపి తిప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు.అన్ని రకాల పోషకాలు ఉండే ఈ పదార్థాలను భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్న భద్రగిరి మార్టులో కొనుగోలుదారులకు సరసమైన ధరలకు అందించడానికి కృషి చేస్తున్నామని   ఐ జి డి ఏ పి ఓ బి రాహుల్  అన్నారు.  

మండలంలోని మారుమూల ప్రాంతం గిరిజన మహిళలకు గిరిజన రైతులకు ఆర్థికంగా చేకూర్పు ఇవ్వడానికి ఈ నెలలో ప్రారంభించబడే భద్రగిరి మార్ట్ లో సహజ సిద్ధమైన తినుబండారాలను మరియు సేంద్రీయ ఆర్గానిక్ ద్వారా తయారు చేసే వివిధ రకాల తినుబండారాలను తయారు చేసే విధానాన్ని సేకరించి పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపించి వివిధ  రకాల ధాన్యాలను వినియోగదారులకు అందించడానికి భద్రగిరి మార్ట్ అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.  ఐటిడిఎ సిబ్బంది సాయి చంద్, భూదేవి తదితరులు పాల్గొన్నారు.