calender_icon.png 9 July, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912

09-07-2025 12:00:00 AM

డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) టి. వెంకటేశ్వర్లు 

ములుగు, జూలై 8 (విజయక్రాంతి): రైతులు, వినియోగదారులు విద్యుత్ శాఖకు తెలపకుండా స్వయంగా కరెంట్ పనులను చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారని కాబట్టి 24/7 అందుబాటులో ఉండే విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించి విద్యుత్ పనులు పూర్తి చేసు కోవాలనీ భూపాలపల్లి సర్కిల్ సిప్టీ ఆఫీసర్,డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్ర మాన్ని చేపడుతున్నామని, ఇందులో వంగిన పోల్ లను, లూజ్ లైన్ లను సరిచేస్తున్నా మని, మద్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నా మని, తీగల మధ్య అవసరం ఉన్న చోట స్పిసర్స్ పెడుతున్నామని తెలిపారు ఇప్పటివరకు పొలంబాట కార్యక్రమం ద్వారా 351 వంగిన పోల్లు,లూజ్ లైన్లు -134. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు-36, మార్చినామని తెలిపినారు.

రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా-అందిస్తున్నామనీ, వారి సమస్యల పరిష్కార ద్యేయంగా పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని అన్నారు. రైతులకు విద్యుత్ ప్రమాదల పట్ల అవగహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యుత్ పట్ల జాగ్రత్త గా ఉండాలని ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవ సాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెం టు మోటార్లు, ఫుట్ వాల్వులు,సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి.

కరెంటు మోటార్లను కానీ, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూ డదు. వ్యవసాయ పంపుసెట్లను,  స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమా దాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయని తెలిపారు అలాగే దీనితో పాటుగా విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా మెరుగైన సరపరా అందించడానికి వ్యవసాయ పంపుసెట్లకు, కెపాసిటర్లు ఎంతగానో ఉపయోగపడుతు న్నాయని అన్నారు. కెపాసిటర్లు -పెట్టుకో వడం వలన మోటార్ల జీవిత కాలం పెరుగుతుందని, లో వోల్టేజి సమస్య ఉండదని అన్నారు.