calender_icon.png 9 July, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటిన ప్రతి మొక్క సంరక్షించేలా చర్యలు

09-07-2025 12:00:00 AM

  1. సంబంధిత శాఖ సిబ్బందికి ఆదేశం

మండల ప్రత్యేక అధికారిణి జ్యోతి 

కామారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం మండల ప్రత్యేక అధికారిని ఏం జ్యోతి, ఎంపీడీవో ఎన్ ప్రవీణ్ కుమార్  ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కలు ప్రతి ఒక్కటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు.

అనంతరం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల బాలికలు దోమకొండ ను సందర్శించి పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉంచాలని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చుట్టు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని ఎలాంటి అంటూ వ్యాధులకు విద్యార్థినీలు లోను గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వేడివేడి భోజనం ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

అనంతరం మండలంలో జరుగుతున్న అన్ని గ్రామ పంచాయితీల వీవోలతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి యొక్క పనితీరు పై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు,ఏపీఎం రాజు, ఏపీఓ కార్యదర్శి యాదగిరి, మహిళా శక్తి సంఘం సభ్యులు పాల్గొన్నారు.