calender_icon.png 23 January, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్‌లో సమస్యలు పరిష్కరించండి

23-01-2026 12:09:57 AM

వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడికి వినతి

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్ లక్ష్మణుడు.. ప్రస్తుత ఉప్పుల శ్రీని వాస్ స్థానంలో వరంగల్ రీజియన్ జాయిం ట్ డైరెక్టర్‌గా గురువారం అదనపు బాధ్యతలు చేపట్టారు. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఛాంబర్ కార్యవర్గ సభ్యులు, అన్ని సెక్షన్ల అధ్యక్ష, కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనం గా సన్మానించి స్వాగతించారు.

వ్యవసాయ మార్కెట్‌లో అపరాల సెక్షన్ ఖరీదుదారులకు కేటాయించిన షట్టర్ల నిర్మాణాన్ని సీజ న్‌కు ముందే పూర్తి చేసి కేటాయించాలని, ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణంలో ఆలస్యమవుతున్నందున రైతులు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముస లమ్మ కుంట స్థలంలో మౌలిక సదుపాయా లు కల్పన తదితర సమస్యలను వివరించా రు. 

కార్యక్రమంలో చాంబర్ గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్, కోశాధికారి అల్లే సంపత్, చాంబర్ కార్యవర్గ సభ్యులు కైలాస హరినాథ్, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్ లింగారెడ్డి, కాటన్ అధ్యక్ష, కార్యదర్శులు చింతల పల్లి వీరారావు, కట్కూరి నాగభూషణం, కూకట్ల సత్యనారాయణ, ఎక్స్‌పోర్టు అండ్ ఇంపోర్ట్ సెక్షన్ అధ్యక్షులు దేవ రమేష్ బాబు, ఫ్రూట్స్ సెక్షన్ అధ్యక్ష, కార్యదర్శులు వెల్ది సాంబయ్య, దొంగల చెన్నమల్లు యాదవ్ పాల్గొన్నారు.