23-01-2026 12:08:40 AM
రామాయంపేటలో హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీ
పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్రావు, ఎస్పీ శ్రీనివాసరావు
రామాయంపేట, జనవరి 22: రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామాయంపేటలో గురువారం హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నా రు. పట్టణంలోని స్కూల్ గ్రౌండ్లో 100 హెల్మెట్ల పంపిణీ అనంతరం స్కూల్ గ్రౌండ్ నుండి వినాయక ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున దాదాపు 27 వేల రోడ్డు ప్రమాదాలు జరుగు తుండగా, అందులో సుమారు 7500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
గత ఏడాది సుమారు 800 మంది హత్యలకు గురైతే, అదే కాలంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7500 మంది మరణించారంటే హత్యలకన్నా పది రెట్లు ఎక్కువ మంది రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. ప్రజలు వాహనాలు సురక్షితంగా వాహ నాలు నడిపి తమ గమ్యాన్ని స్థానలను చేరుకోవాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులు రోడ్డు నియమాలు పాటించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట్ ఇన్చార్జ్ సీఐ రంగా కృష్ణ, ఆర్టీఓ వెంకట స్వామి, జీఎంఆర్ ప్రతినిధి షాలిని, మేనేజర్, ఎస్‌ఐ బాలరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.