calender_icon.png 25 May, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరంలో ట్రాఫిక్ కష్టాలు

25-05-2025 10:54:05 AM

పార్కింగ్ స్థలం లేక ప్రధాన రహదారిపైనే నిలిచిపోయిన వాహనాలు

ట్రాఫిక్ సమస్య నియంత్రించడంలో స్థానిక పోలీసులు విఫలం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

మంథని మహాదేవ పూర్, (విజయక్రాంతి): ట్రాఫిక్... ట్రాఫిక్... ట్రాఫిక్ ఎటు చూసినా కాళేశ్వరంలో ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. సరస్వతి పుష్కరాలకు ఇక ఒకరోజే గడువు ఉండడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జనం అధిక సంఖ్యలో పుణ్య స్థానాలు చేసేందుకు   భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతో 11వ రోజు ఆదివారం కూడా కాళేశ్వరం భక్తులతో కిటికీటలాడుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కూరిసిన వర్షాలకు పార్కింగ్ స్థలాలు బురదమయం కావడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేక వాహనాలకు పార్కింగ్ సమస్య పెద్ద సమస్యగా తయారైంది. దీంతో మహాదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు ప్రధాన రహదారిపై క్యూ కడుతున్నాయి. మహాదేపూర్ నుంచి కాళేశ్వరం చేరుకోవాలంటే దాదాపు 5 నుండి 6 గంటల సమయం పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తున్నప్పటికీ, కిందిస్థాయి అధికారులు సహకరించడం లేదని తెలుస్తోంది. 

భక్తులను అంచనా వేయడంలో అధికారులు విఫలం 

ముందు చూపు లేకనే ట్రాఫిక్ సమస్య: పోలీసులపై భక్తుల ఆగ్రహం

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు ఎన్ని లక్షల మంది వస్తారు.  అని అధికారులు ముందస్తుగా అంచన వేయకపోవడంతోనే ఈ ట్రాఫిక్ సమస్య వచ్చిందని తెలుస్తుంది. జిల్లా అధికారులు ముందు చూపు లేక లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను స్థానిక పోలీసుల ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని, విధుల కోసం ఇతర జిల్లా నుంచి వచ్చిన పోలీసులకు ట్రాఫిక్ సమస్య ఎలా తెలుస్తుందని, భక్తులు ప్రశ్నిస్తున్నారు . స్థానిక పోలీసులు పుష్కరాలపై చిన్న చూపు చూడడంతోనే ఈ సమస్య ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి అధికారులకు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ట్రాఫిక్ సమస్యతో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. అన్నారం మూలమలుపు నుండి కుదురుపల్లి వరకు తట్టిన ట్రాఫిక్ జామ్ అయింది.  మద్దులపల్లి నుండి పూసుకుపల్లి కాళేశ్వరం వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. 4 గంటల నుండి 5 గంటల అలా వరకు ప్రయాణికులు  బస్సులలోనే తమ వెహికల్ లోనే ఉంటున్నారు. నట్టడివిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.