25 July, 2026 | 3:16 PM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సోనియా సందేశం

02-06-2024 11:59 AM

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ సోనియా గాంధీ నివాళులర్పించారు. 2004లో కరీంనగర్‌లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తాను చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకున్న ఆమె, పార్టీలోనే అనేక సవాళ్లు ఎదురైనాయని, అయితే తెలంగాణ ప్రజల దృఢ సంకల్పం తనకు ఇచ్చిన హామీని నెరవేర్చే శక్తిని ఇచ్చిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ చరిత్ర ఉన్నంతవరకూ  ఈ సమాజం సోనియా గాంధీని తల్లిగానే గౌరవిస్తోందన్నారు. తెలంగాణ గడ్డతో సోనియాగాంధీది రాజకీయ బంధం కాదు.. పేగు బంధం ఉందని  తెలిపారు. 

https://twitter.com/INCTelangana/status/1797148497398882803