calender_icon.png 22 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో మున్నూరు కాపుల సింహగర్జన

22-10-2025 07:16:24 PM

మున్నూరు కాపుల జనాభా గణాంకాలను ప్రభుత్వాలకు అందిస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య..

గంభీరావుపేట (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపుల సంఖ్యను సక్రమంగా గుర్తించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించేందుకు మున్నూరు కాపు సంఘం భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సమగ్ర కుటుంబ సర్వే, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. బుధవారం గంభీరావుపేటలో జరిగిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... "కుల గణన సర్వేలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువగా నమోదైన నేపధ్యంలో, మా వాస్తవ జనాభా గణాంకాలను సభ్యత్వ నమోదుతో ప్రామాణికంగా చూపించనున్నాం. మున్నూరు కాపులకూ మంత్రి పదవులు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో సంఘ భవనాల నిర్మాణం వంటి హక్కుల కోసం త్వరలో ‘సింహగర్జన’ కార్యక్రమం నిర్వహించనున్నాం" అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్లూరి చందన, మండల అధ్యక్షుడు మేకర్తి బిక్షపతి, నాయకులు కిరణ్ బాబు, ఎర్ర నర్సయ్య, బోయన్నగారి లింగం, గంట అశోక్, శెట్టి రవి, హన్మాండ్లు, వేశాల వెంకటి తదితరులు పాల్గొన్నారు.