calender_icon.png 22 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

22-10-2025 07:20:33 PM

రైతుల అభివృద్దే సహకార సంఘం లక్ష్యం..

సర్వారం పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ పెండెం ముత్యాల గౌడ్..

గరిడేపల్లి (విజయక్రాంతి): సహకార సంఘాలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని, రైతుల అభివృద్ధి లక్ష్యంగా సహకార సంఘం పనిచేస్తుందని సర్వారం పీఏసీఎస్ చైర్మన్ పెండెం ముత్యాలు గౌడ్ అన్నారు. గరిడేపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సర్వారం సహకార సంఘానికి స్వల్ప దీర్ఘకాలిక రుణాలను అందించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరగా డిసిసిబి చైర్మన్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సహకార సంఘం పరిధిలోని రైతులు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డిని సన్మానించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారామరెడ్డి, ఆరే కృష్ణారెడ్డి, యోహన్ తదితరులు పాల్గొన్నారు.