calender_icon.png 22 October, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన, ప్రజలకు షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు

22-10-2025 07:10:13 PM

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన, ప్రజలకు షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు..

పోలీసు కమిషనర్ గౌస్ ఆలం..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకుగాను విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన, ప్రజలకు షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఈనెల 22 నుండి 28 వరకు అన్ని రకాల విద్యార్థులందరికీ ఆన్లైన్ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహించబడుతున్నాయి. డ్రగ్స్ నిర్వహణ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశంపై పోటీలు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మూడు భాషల్లో నిర్వహించబడతాయని పేర్కొన్నారు.

విద్యార్థులు రాసిన వ్యాసాలను 28వ తేదీ వరకు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA అప్లోడ్ చేయాలని, ప్రతి భాష నుండి కమీషనరేట్ లెవెల్ టాప్ ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రజలందరికీ పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిల్మ్ పోటీలు, ఇటీవల తీసిన పోలీసులకు సంబంధించిన ఫోటోగ్రఫీ కాంపిటేషన్ కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. పోటీదారులు తమ షార్ట్ ఫిల్మ్, ఫోటోలను  కమీషనరేట్ లోని పోలీస్ కమీషనర్ కార్యాలయంలో గల ఐటీ కోర్ కార్యాలయం నందు అందజేయవచ్చని, ఈ పోటీలలో కూడా కమీషనరేట్ లెవెల్ టాప్ ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రజలు, విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని పోలీస్ కమిషనర్ కోరారు.