13-05-2025 11:35:29 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం కేంద్రం మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భేటీలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ఆపరేషన్ సిందూర్ పై ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత జరగే మొదటి క్యాబినెట్ భేటీ కావడం గమనార్హం.
మరోవైపు ఈనెల 19న విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో భేటీ కానుంది. కమిటీ సభ్యులకు ఆపరేషన్ సిందూర్ వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తీ వెల్లడించనున్నారు.