calender_icon.png 13 May, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా మాట వినాలి.. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి: ఎంపీ జైరాం రమేష్

13-05-2025 12:42:00 PM

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ స్పందించారు. 1999లో కార్గిల్ యుద్ధం ముగిసిన మూడు రోజుల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం, జూలై 29, 1999న కార్గిల్ సమీక్ష కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.  ఈ కమిటీకి  5-6 మంది సభ్యులు నియమించారని, కె సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారని పేర్కొన్నారు. కార్గిల్ సమీక్ష కమిటీ నివేదికను ఫిబ్రవరి 23, 2000న పార్లమెంటులో సమర్పించారన్నారు. 

ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఆపరేషన్ సిందూర్ కు మొదటి నుంచీ మద్దతు ఇస్తోంది. కానీ ప్రధాని ప్రసంగానికి ముందే ట్రంప్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించారని తెలిపారు.  దీనిపై ప్రధాని ఏమీ మాట్లాడలేదని, ప్రధాని చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని, ఆయన మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామని,  ట్రంప్ అన్ని ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు.. ?, భారతదేశం, అమెరికా వాణిజ్యం, భారత్-పాకిస్తాన్ యుద్ధం నిలిపివేయడంతో సంబంధం ఏమిటి.. ? అని ప్రశ్నించారు. 

ఇఎఎమ్, ఎన్ఎస్ఎ, ప్రధాని, అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. శరద్ పవార్ చేసిన ప్రకటనపై తను ఏమీ వ్యాఖ్యానించనని, కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని కోరుకుంటున్నాయని అన్నారు. ప్రధాని మోదీ తామ మాట వినాలి.. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కూడా ప్రతిపక్ష నాయకులను పిలవాలని ఎంపీ జైరామ్ రమేష్ కోరారు.