28-11-2025 03:03:58 PM
సిద్దిపేట క్రైం: ఈ నెల 30న గీతా జయంతిని పురస్కరించుకుని హిందూ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గీతా శోభాయాత్ర, సామూహిక గీతా పారాయణం కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో దేవారపు మల్లికార్జున్, కొత్తకొండ రాజు, పొదిల శ్రీనివాస్, మద్ది సుధాకర్ లు మాట్లాడారు.
సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ధ్యాన మందిరం వేడుకలకు వేదికగా నిలువనుందని తెలిపారు. భగవద్గీత ప్రచారం, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణ లక్ష్యంగా సమితి ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పారు. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. భగవద్గీతలోని శ్లోకాల పఠనం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి గీతాలాపన, భవాని క్లాసికల్ డాన్స్ అకాడమీ వారి నృత్య ప్రదర్శన, కోలాటాలు తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.