28-11-2025 04:33:28 PM
చిత్ర మిషన్ ఐ కేర్ ఫౌండర్ చైర్మన్ దాస్ రెడ్డిమల్ల
ఖానాపూర్,(విజయక్రాంతి): కంటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కంటి చూపును కాపాడుకొనే దిశగా అవగాహన కలిగి వుండాలని చిత్ర మిషన్ ఐ కేర్ ఫౌండర్, చైర్మన్, కంటి వైద్య సహాయకులు ఏసుదాస్ రెడ్డిమల్ల సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో వృద్ధాప్య, వితంతు, బీడీ కార్మిక ,పెన్షన్ దారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్ స్క్రీన్ ,టీవీ,లు చూడటం పరిపాటిగా మారిందని, దీనివల్ల కంటి చూపు మీద భారం పడి కన్ను బలహీనతకు గురి కావడం జరుగుతుందని,దీంతో ప్రజలు ఆర్థిక,ఆరోగ్య నష్టాల బారిన పడే ప్రమాదం వుంటుంది. అలా కాకుండా తమ కంటి సంరక్షణ తమ చేతుల్లోనే ఉందని, తగు ఆహార అలవాట్లు కనీస జాగ్రత్తలు తీసుకుంటే కంటి చూపును జీవితకాలం కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ మేరకు పలు ఆరోగ్య సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు, గ్రామస్తులు పలువురు ఉన్నారు.