calender_icon.png 25 August, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో స్పీకర్ల సదస్సు

25-08-2025 12:59:20 AM

హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఢిల్లీలోని అసెంబ్లీ భవనంలో  రెండు రోజుల పాటు జరిగే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌ను కేంద్ర హోంశాఖ మం త్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌కు 29 రాష్ట్రాలకు చెందిన స్పీకర్లు, ఆరు రాష్ట్రాలకు చెందిన శాసనమండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు హాజర య్యారు.

ఈ సందర్భంగా 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్పీకర్‌గా ఎన్నికైన విఠల్‌భాయ్ పటేల్ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అ మిత్‌షా  విడు ద చేశారు. ఆ త ర్వాత దేశంలో శాసనసభల చ రిత్రను తెలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఈ సం దర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సన్మానించా రు. సదస్సులో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ డా.వి నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.