25-08-2025 12:58:45 AM
-పంట నష్టపోయిన రైతులను పట్టించుకోని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు
-వరద ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి): పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తిగా విఫలమైయ్యిందని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే లు సైతం రైతులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, తంతోలి లింగి గూడా గ్రామాలలోని వరదలతో నష్టపోయిన పంట పొలాలలో పర్యటించి, బాధిత రైతులను కలిసి వారిలో మనోధైర్యాన్ని నింపారు.
పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రూ.10 వేల నష్టపరిహారాన్ని అందిస్తే సరిపోదు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రూ. 25 వేల పంట నష్టపరిహారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు జగదీష్, మెట్టు ప్రహల్లాద్, కుమ్ర రాజు, కనక రమణ, తదితరులు పాల్గొన్నారు.