calender_icon.png 25 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు దారుణ హత్య

25-08-2025 10:37:44 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad district) సోమవారం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మాక్లూర్ మండలం ధర్మోరలో(Dharmora) ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు రౌడీషీటర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నిజామాబాద్ నగరం దుబ్బకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్తలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగాయా? ఇతర కారణాలు ఉన్నాయా? ఎవరు హత్య చేశారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.