calender_icon.png 25 August, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

25-08-2025 12:59:57 AM

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ఆదిలాబాద్, ఆగస్టు 24 (విజయక్రాం తి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుదల వల్ల పంట నష్టపోయిన రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. బేలా లోని పెన్‌గంగా నది పరివాహక గ్రామలైన సాంగిడి, భేదోడా, మనియర్‌పూర్ తదితర గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటపొలాలను పరిశీలించి, పంట నష్టం వివరా లు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర మాట్లాడుతూ.. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులు అధైర్య పడకుండదని, ఏమైన సమస్యలు ఉంటే నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చు అన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రిని కలిసి రైతులు నష్టపోయిన పంటల వివరాలను స్వయంగా తెలియజేసి, వారిని ఆదుకునేల కృషి చేస్తానని అన్నారు. ఇటీవల మంత్రి జిల్లాలో పర్యటించి, పదివేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ఇప్పటికీ ఆమలు కాలేదన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు ఇంద్రజిత్, మురళీధర్ ఠాక్రే, దత్తా నిక్కం, ప్రవీణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు