22 July, 2026 | 1:47 AM

ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

22-07-2026 12:00 AM
  1. టిప్పుకాన్ బ్రిడ్జి నుండి సాధన మెడికల్ కాలేజీ వరకు డివైడర్ నిర్మాణం
  2. రూ.5.09 కోట్లతో 4.5 కిలోమీటర్ల్లు 

రాజేంద్రనగర్, జూలై 21 (విజయక్రాంతి): ప్రమాదాల నివారణకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక కార్యచరణను మొదలుపెట్టింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని టిప్పుకాన్ బ్రిడ్జి నుండి సాధన మెడికల్ కాలేజీ వరకు డివైడర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రోడ్డు వెంబడి గతం లో నిర్మించిన చిన్నపాటి డివైడర్ ఉండటం  తో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి  ప్రజల ఇబ్బందులను ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ అధికారుల సూచన మేరకు జిహెచ్‌ఎంసి 5.09 కోట్ల రూపాయలను మంజూరు చేసింది .

ఈ నిధులతో 4.5 కిలో మీటర్ల పొడవునా డివైడర్ ను నిర్మించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి డివైడర్ అనంతరం అందులో మట్టి నింపి బ్యూటీఫికేషన్లో భాగంగా పూల మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి తెలిపారు . రోడ్డుకు మధ్యలో ఉన్న పాత డివైడర్ ను జెసిబి ద్వారా తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే దాదాపు మూడు ఫీట్ల ఎత్తున కొత్త డివైడర్ ను నిర్మిస్తున్నారు

ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం.. 

నాలుగున్నర కిలోమీటర్ నిర్మించే డివైడర్ పనులు ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని  జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ ఏఈ నాగిరెడ్డి తెలిపారు పెరుగుతున్న ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా ప్రమాదాలను  నివారించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డివైడర్ ను నిర్మిస్తున్నట్లు ఎ ఈ తెలిపారు.. 

 ఏఈ నాగిరెడ్డి

పనులను నాణ్యతగా చేపట్టాలి..

టిప్పు కాన్ బ్రిడ్జి నుండి సాధన మెడికల్ కాలేజ్ వరకు నిర్మిస్తున్న డివైడర్ పనులను నాణ్యతగా చేపట్టాలని పనుల నాణ్యతలో రాజీ పడవద్దు అని బండ్లగూడ జాగిర్ బిజెపి అధ్యక్షుడు కొండె మహేష్ యాదవ్ జిహెచ్‌ఎంసి  అధికారులకు విజ్ఞప్తి చేశారు.

 కొండె మహేష్ యాదవ్ బండ్లగూడ జాగిర్ బీజేపీ అధ్యక్షుడు