calender_icon.png 23 August, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేక్ కట్ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టాడు

23-08-2025 01:40:55 AM

  1. బాలుడి తండ్రి ప్రాణాన్ని తీసుకురాగలమా ?
  2. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి..
  3. రామంతాపూర్ విద్యుత్ ప్రమాద ఘటనపై జస్టిస్ నగేశ్ భీమపాక భావోద్వేగం

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : ‘పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు తండ్రికి తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఆ దృశ్యాలు కలచివేశాయి. రామంతాపూర్ విద్యుదాఘాతం ఘటనలో ఐదుగురు మృతి చెంద డం చిన్న విషయం కాదు.. ఘటనపై ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా? తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఆ బాలుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ తండ్రి ప్రాణాన్ని మళ్లీ తీసుకురాగలమా?

సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’ అంటూ హైకోర్టు జస్టిస్ నగేశ్ భీమాపాక భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం తర్వాత విద్యుత్‌శాఖ సిబ్బంది ఆ ప్రాంతం లో ఎయిర్‌టెల్ కేబుళ్లను తొలగించగా, వాటిని తిరిగి బిగిం చుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారతి ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..

కేబుల్ తీగల బరువుతో స్తంభాలు ఒరుగుతున్నాయని వివరిస్తుండగా, జస్టిస్ నగేశ్ భీమపాక అడ్డుకుంటూ.. ‘విద్యుత్ స్తంభా లు కాదు.. మా మూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయి’ అంటూ తీవ్రమైన వాఖ్యలు చేశారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వల్ల ఉపయోగం లేదని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవడమే ఉత్తమమైన మార్గమని హితవు పలికారు. మళ్లీ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. స్తంభాలపై వేలాడుతున్న తీగలన్నీ నలుపు రంగులో ఉన్నాయి.. కాబట్టి, సిబ్బంది గుర్తుపట్టలేకపోయారని కోర్టుకు తెలిపారు.