04-01-2026 04:02:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి ఒరిస్సా లో గల పూరీ జగన్నాథ్ ఆలయానికి ప్రత్యేక సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ నిర్మల్ డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ఈ బస్సు ఫిబ్రవరి 6 వ తేదీ రోజు మ!! 2 గం!! లకు నుండి బయలు దేరి మరుసటి రోజు అన్నవరం చేరుకుంటుంది. అక్కడ సత్యనారాయణ స్వామిని దర్శించుకొని సింహాచలం అయ్యన్న చేరుకుంటుందని, ఆ తర్వాత శ్రీకాకులం జిల్లా అర్సవెల్లి సూర్యా నారాయణ స్వామిని దర్శించుకొని ఒరిస్సా లో గల పూరీ జగన్నాథ్ చేరుకొనును.
పూరి లోని జగన్నాథ్ టెంపుల్ కోణార్క్ లోని సన్ టెంపుల్ దర్శించుకొని విశాఖపట్నం కైలాసగిరి, ఆర్.కే తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఏలూర్ జిల్లా లోని ప్రసిద్ద పుణ్య క్షేత్రం అయినా శేషాద్రి కొండపైన వెలసిన ద్వారక తిరుమల చిన్న తిరిపతికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 6 వ రోజైన 11 ఫిబ్రవరి రోజు నిర్మల్ చేరుకుంటుంది అని ఈ ఆరు రోజుల యాత్రకు ఛార్జి 6399/- ఉంటుందని భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే భరించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యాత్రకు వెళ్ళవలసిన వారు ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో గాని మన నిర్మల్ బస్టాండ్ రిజర్వేషన్ కౌంటర్ లో గాని ముందస్తు టికెట్లు బుక్ చేసు కోవాలని ఆయన తెలిపారు. మరింత సమాచారం కొరకు, 9959226003, 8328021517 లేదా 7382842582 లో సంప్రదించాలని డిపోమేనేజర్ తెలిపారు.