calender_icon.png 6 January, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 7న ఉపాధి కోర్సులపై అవగాహన సదస్సు

05-01-2026 02:20:21 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు 100శాతం జాబ్ గ్యారెంటీతో అందించే వివిధ ఉపాధి కోర్సుల గురించి జనవరి 7న  సమీకృత  జిల్లా కలెక్టరేట్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణతో పాటు  100శాతం జాబ్ గ్యారంటీ తో ఉపాథి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో  జిల్లా యంత్రాంగం, ఎల్.ఎస్.సి & రెడింగటన్ ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ తో ఉపాధి కోర్సులు అందించడం జరుగుతుందని తెలిపారు.

10వ తరగతి, ఇంటర్ పాసైన అభ్యర్థులకు రియల్ టైం ఫార్క్ లిఫ్ట్ ఆపరేటర్ అనే 38 రోజుల వ్యవధి  గల కోర్సు, ఇంటర్ ఉత్తీర్ణత తో ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు 53 రోజుల విభక్తి గల సప్లై అసోసియేట్ కోర్సు ఉచితంగా అందించడం జరుగుతుందని, కోర్స్ తో పాటు ఉచిత భోజన వసతి సౌకర్యం, పరిశ్రమల పరిశీలన, స్కిల్ ఇండియా సర్టిఫికెట్, 100% జాబ్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 19 నుంచి 28 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉన్న వారందరూ ఉచిత శిక్షణ కోర్సు కు హాజరు కావచ్చని,  ఈ కోర్సుల పట్ల అవగాహన కార్యక్రమం జనవరి 7న సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నామని, జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.