calender_icon.png 6 January, 2026 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

05-01-2026 01:34:34 PM

ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ 

జగదేవపూర్:(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్య(Sanitation) చర్యలు చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. సోమవారం జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో పర్యటించారు. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న నర్సరీని స్థానిక సర్పంచ్ రజిత పరశురాం తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ పిచ్చి మొక్కలు చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య నిర్మూలన చర్యలు వేగవంతం చేయాలని  సూచించారు. నర్సరీలో నూతన మొక్కల పెంపకం,  నర్సరీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ అభివృద్ధి పనులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. అంతకుముందు ఎంపీడీవో శ్రీనివాస్ వర్మకు స్థానిక నూతన సర్పంచ్ రజిత పరశురాం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో గజ్వెల్ ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి,  పిఎసిఎస్ డైరెక్టర్ భూమయ్య,  మాజీ సర్పంచ్ ఎల్లయ్య, స్థానిక నాయకులు అశోక్,  ఎల్లారెడ్డి,  మహేందర్ రెడ్డి,  కార్యదర్శి నరేందర్, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్,  ఫీల్డ్ అసిస్టెంట్ పార్వతి, పంచాయతీ సిబ్బంది లచ్చయ్య, రాములు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.