05-01-2026 02:25:01 PM
సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి హాజరై కొబ్బరి కాయ కొట్టి భూమి పూజప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వేములవాడ ఆది శ్రీనివాస్ మంజూరు చేసిన 4 లక్షల నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దళిత వాడల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించినందుకు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెజుగం మహేష్, మాల సంఘం అధ్యక్షుడు ఎరుగొక్కుల రమేష్ తో పాటు వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్యాక్స్ డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, మాల సంఘం పాలక వర్గం గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.