05-01-2026 02:18:31 PM
ప్రతి ఇంటికి రెండు మొక్కలు అందజేతే లక్ష్యం
చివ్వెంల, (విజయక్రాంతి): చివ్వెంల మండలం జయరాం గుడి తండా గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వెంకన్న చెట్ల పెంపకానికి ఊతమిస్తూ నర్సరీ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. గ్రామాన్ని పచ్చదనంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ నర్సరీని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నర్సరీలో ప్రజలకు అవసరమైన వివిధ రకాల మొక్కలను పెంచి, ప్రతి ఇంటికి రెండు మొక్కలు ఉచితంగా అందించడమే తన లక్ష్యమని సర్పంచ్ వెంకన్న పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమణ, టీఏ రమాదేవి, ఉప సర్పంచ్ శారద శంకర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సైదులు, రెండవ వార్డ్ మెంబర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.