10-05-2025 01:58:54 AM
న్యాయమూర్తి గోపికృష్ణ కృషితో ఫలించిన ఫలితం
నిజామాబాద్ మే 9: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లాకోర్టు, హైకోర్టు లలో చట్టబద్ధత హక్కుల కోసం ఆరాటం. విలువైన సమయం కాలమనే కాలగర్భంలో కలిసి పోయినయ్. ఎడతెగని సివిల్ పంచాయతీ . మ్ఫు గుంటల భూమి కోసం ఇరవైమూడేళ్ల సుదీర్ఘ న్యాయబద్ద తీర్పు కోసం పట్టువదలని పిటిషన్ దార్లు.కాలం విలువ తెలిసిన న్యాయమూర్తి, అందరిని కలిపిండు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపారు.
రాజీమార్గం రాజ మార్గం అనే సూత్రంతో న్యాయమూర్తి చేసిన ప్రయత్నాలు ఇరువర్గాలు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయ్యింది. .రాజీపద్దతిన రాజీ చేసి లోక్ అదాలత్ అవార్డు జారీ చేసిండు. అతనే నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారం గోపికృష్ణ. జూన్ 14 న నిర్వహించుకోబోయే జాతీయ లోక్ అదాలత్ కు తనదైన తొవ్వ జూపిండు. ఆ సివిల్ భూమి వివాదపు కథ.
డొద్ద సంతోష్ రెడ్డి నవిపేట్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో 30 గుంటల భూమిని బిల్లి చిన్న గంగరామ్ నుండి కొనుగోలు చేసి 7 మార్చి,2002 న రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అట్టి భూ తమ పూర్వీకులదని, అమ్మే హక్కు తమ తండ్రికి లేదని చిన్న గంగారామ్ కుమారులు పెద్ద గంగాధర్, గంగరామ్, సత్యనారాయణ, గాంధీ లు రెడ్డి తో గొడవపడుతు,అతను కొన్న భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేసేవారు. వీరి నుండి రక్షణకు అతను నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 2 సెప్టెంబర్2002 న సివిల్ దావా వేసి రక్షణ పొందారు.
అయిన బిల్లి వారి ఆగడాలు ఆగలేదు. కోర్టు ఇరుపక్షాల డాక్యుమెంట్స్, సాక్ష్యాలను నమోదు చేసుకుని రెడ్డికి అనుకూలంగా 18 ఆగస్టు,2004 లో తీర్పు చెప్పింది.అనంతరం రెడ్డి సదరు భూమిని గాధరి రాఘవులు,హీరేకర్ సత్యనారాయణ, న్యంతబాద్ గాంధీలకు అమ్మివేశాడు.జూనియర్ సివిల్ కోర్టు తీర్పును బిల్లి కుటుంబం జిల్లాకోర్టులో అప్పీలు చేసింది.అక్కడ కూడా వారు ఓడిపోయారు.
సివిల్ కోర్టు తీర్పును అమలు చేయాలని సంతోష్ రెడ్డి అమలు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులలో న్యాయ విచారణకు ఉండి. సదరు భూమిలోకి వెళ్ళి గొడవ చేయరాదని,అక్రమంగా ప్రవేశించారాదని కోర్టు ఉత్తర్వులు ఉన్న బిల్లీ వారు కోర్టు ఉత్తర్వులు ఉల్లగించారని రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు అమలు పిటిషన్ లో భాగంగానే బిల్లీ వారికి నెల రోజుల సివిల్ జైలుశిక్ష ను ఖారురు చేసింది.
దీనిని వారు రాష్ట్ర హైకోర్టు లో సవాలు చేసి అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు.కేసు పూర్వపరాలు అధ్యయనం చేసిన జడ్జి గోపికృష్ణ ,రెడ్డి తరపున న్యాయవాది జక్కుల వెంకటేశ్వర్,బిల్లి గంగరామ్ కుటుంబ సభ్యుల తరపున న్యాయవాది శ్రీహరి ఆచార్య లతో సంప్రదింపులు జరిపి ఒక రాజీ పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేసి,కక్షిదారలైన సంతోష్ రెడ్డి, బిల్లి గంగరామ్ తదితరులను రాజమార్గం వైపు నడిపించారు.
న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారుల ఉమ్మడి ప్రయత్నం దీర్ఘకాలిక భువివాదాన్ని రెడ్డి కి,బిల్లి కుటుంబానికి మధ్య భూమిని సమబాగం చేసి భువివాదానికి అంతిమ పరిష్కారం చూపారు. కక్షిదారుల తరపున న్యాయవాదులచే లోక్ అదాలత్ బెంచ్ లో ఒక ఉమ్మడి రాజీ పరిష్కార పిటిషన్ దాఖలు చేయడంతో అవార్డును జారీ చేశారు.ఇరవై మూడేళ్ళ న్యాయవివాదానికి లోక్ అదాలత్ లో ముగింపు పలికారు.