14-07-2025 12:17:24 AM
- 54 వాహనాలు సీజ్..
- మైనర్ తల్లి తండ్రులను కలిపి 68 మందికి కౌన్సెలింగ్
నిర్మల్ జులై 13( విజయ క్రాంతి) జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డా: జి. జానకి షర్మిల, ఆదేశాల మేరకు ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడింది.ఈ డ్రైవ్లో మొత్తం 54 మైనర్ డ్రైవింగ్ వాహనాలు సీజ్ చేయబడినవి.
మైనర్లు మరియు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 68 మందికి సంబంధిత స్టేషన్ SHO లు స్థానికంగా కౌన్సిలింగ్ నిర్వహించారు.మోటారు వాహనాల చట్టం ప్రకారం మైనర్ల వాహన నిర్వహణకు వాహన యజమాని (తల్లిదండ్రుల)దే బాధ్యత అని SHOలు హెచ్చరిం చారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు పూర్తి బాధ్యతను తీసుకోవాలని వారు సూచించారు.ఇది వరకు 70 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, మైనర్లు వారి తల్లిదండ్రులు కలుపుకొని 107 మందికి కౌన్సిలింగ్ ఇవ్వబడింది.ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు, అన్ని స్టేషన్ల SHOలు పాల్గొన్నారు.