14-07-2025 12:18:29 AM
శామీర్ పేట్, జూలై 13: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పై కవిత అనుచరులు తెలంగాణ జాగృతి గుండాలు దాడి చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని శామీర్ పేట్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చాట్లపల్లి నర్సింగరావు అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న గొంతెత్తి పోరాడుతున్నాడని బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని పోరాడుతున్న వ్యక్తిపై తెలంగాణ జాగృతి గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అనే ఒక బోగస్ సంస్థను అడ్డం పెట్టుకొని గుండాలను తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి పెంచి పోషిస్తుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఎవరు చేసినా ఊరుకునేది లేదని. ప్రభుత్వం వెంటనే దాడిని ఖండిస్తూ కవితను అరెస్టు చేయాలని ఆయన అన్నారు.ఇలాంటి అనైతిక పనులు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు.మల్లన్నపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.