16 April, 2026 | 3:49 AM

రాకా కోసం ప్రత్యేక కసరత్తులు

16-04-2026 02:19 AM

నటుడు అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’.  ఈ సినిమాలో ఆయన కొత్త లుక్ నెట్టింట సంచనాలను సృష్టించింది. ముఖ్యంగా ఆయన చేతితో చూపిస్తున్న స్టైల్ వైరల్ అయ్యి, చాలా మంది దాన్ని అనుసరిస్తున్నారు. ఇటీవల ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక పాండ్య కూడా ఓ ఐపీఎస్ మ్యాచ్ సమయంలో ఆ స్టైల్‌ను రీక్రియేట్ చేయటం విశేషం. ఈ లుక్, దాని ఇంటెన్సిటీ కోసం అల్లు అర్జున్ ఎంతగానో శ్రమించారు. రెండు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన స్టైల్, నటన, మాస్ అప్పీల్‌ను మార్చుకుంటూ ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘రాకా’ లుక్ కోసం అల్లు అర్జున్ ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గంటల పాటు సన్నద్ధమవుతున్నారు.