3 June, 2026 | 12:00 AM

Breaking News

అక్రమ రవాణాగా ఇసుక.. అధికారుల కన్నులకు మసక!   •   రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి హీట్!   •   ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి   •   రైతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్   •   ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్!!   •   సాయి సామల చెస్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు   •   శివంపేట మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!!   •   ఎందరో మహానుభావుల బలిదానాల త్యాగ ఫలం   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   పండుగలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం

10-04-2026 08:34 PM

సర్పంచ్ కృష్ణనాయక్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందని సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ అన్నారు.మండల పరిధిలోని సూర్యానాయక్ తండాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పీహెచ్సీ అర్వపల్లి ఆధ్వర్యంలో అసంక్రమణ వ్యాధుల నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ ఆధ్వర్యంలో బీపీ, షుగర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలతో పాటు కన్ను, చెవి, ముక్కు, గొంతు సంబంధిత పరీక్షలను గ్రామస్తులు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ కృష్ణనాయక్ మాట్లాడుతూ గ్రామప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు,అవసరమైన మందులు అందుబాటులోకి తీసుకురావడం తన బాధ్యతని, ప్రజలు ఇట్టి శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.