11 April, 2026 | 5:45 PM

Breaking News

అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక పోషణ శిబిరం

11-04-2026 04:07 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం రత్నాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలు, చిన్నారుల కోసం ప్రత్యేక పోషణ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 8వ పోషణ పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు తొలి వెయ్యి రోజులలో పోషకాహారం ఎంత ముఖ్యమో వివరించారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, సంరక్షకులతో కమ్యూనిటీ సమావేశం నిర్వహించి తల్లి-శిశు ఆరోగ్యానికి సమతుల్య ఆహారం అవసరాన్ని తెలియజేశారు. అలాగే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం కీలకమని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొండ రాజేందర్, ఏఎన్‌ఎం టీ. భాగ్య, ఆశా కార్యకర్తలు బీ.విజయ, ఎస్.లావణ్య, అంగన్‌వాడీ టీచర్లు శరణ్య, శశికళ, గ్రామస్తులు పాల్గొన్నారు.