calender_icon.png 18 August, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

18-08-2025 04:55:13 PM

రాధాకృష్ణ వేషాధారణలో అలరించిన చిన్నారులు

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేటలోని కాకతీయ టెక్నో హైస్కూల్లో  సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, కోపికలు వేషాదారణలలో అందంగా ముస్తాబయ్యారు. కృష్ణుడు, గోపికలు నృత్యాలు చేస్తూ, ఉట్టికొడుతూ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగ్గు మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక భావాలను పొందాలని తెలిపారు.

అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులకు పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల సేవ కార్యక్రమాలను చేస్తూ, విద్యార్థులకు బాధ్యతను నేర్పుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. కోట్లాదిమంది ఇష్టదైవంగా భావించే శ్రీకృష్ణుని వేషాధారణతో పాటు గోపికలను వేషాదరణ చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.