అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న..
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
సికింద్రాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): అమావాస్యను పురష్కరించుకుని న్యూ బోయినపల్లి బాపూజీనగర్ శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయం, చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయాల వద్ద ఆలయ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించి పాల్గొన్నారు.
అనంతరం జంపన ప్రతాప్ మాట్లాడుతూ అన్ని దానాల కన్న అన్నదానం మిన్న అని అ మావాస్య రోజు అన్నదానం చేయడం గొప్ప పుణ్య కార్యక్రమం అని అన్నారు... హ్యుమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాంటియ, ఆలయ కమిటీ సభ్యులు, ప్రేమ్ ముదిరాజ్, అజిత్ కళ్యాణ్,పుట్టి నర్సింహా, శ్రీకాంత్, రామరావు, కృష్ణ, మారుతీ గౌడ్, కట్టమైసమ్మ ఆలయ కమిటీ క్రాంతి విట్టల్ రావు, సాయి, విజయలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






